నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బస్తీ భూముల పంపిణీలో కొందరు రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. భూ పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా చూడాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అధికారులు పూర్తిస్థాయిలో సర్వేచేసి, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి: మూడు డిమాండ్లు నెరవేర్చాలి: కాంగ్రెస్