నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా ఆలయంలోని అక్షరాభ్యాస మండప ప్రధాన ద్వారం సమీపంలో ఓ పాము ప్రత్యక్షమయ్యింది. నాగపంచమి రోజు పాము దర్శనమివ్వడం చూసి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.
పాముకు పాలు పోసి కుంకుమార్చనలు చేశారు. లింగాకారంలో పాము కనిపించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..