నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కూష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రలతో అమ్మవారికి 'అల్లం వడలు(గారెలు)' నైవేద్యంగా సమర్పించారు. అమ్మవార్లకు కుంకుమార్చన, హారతితో విశేష పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఇదీ చూడండి: నమ్మకంగా పనిచేస్తారు.. మత్తుమందిచ్చి ఇళ్లంతా దోచేస్తారు