ETV Bharat / state

అప్పుడు పెళ్లికి ముందు వెళ్లిపోయింది.. ఇప్పుడు ఆస్తి కోసం గొడవకు దిగింది - property deliberately went into conflict

ఓ యువతి తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి కాదంది.. పెళ్లికి రెండురోజుల ముందు ప్రేమించిన వ్యక్తితో గత నెలలో వెళ్లిపోయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. తాజాగా ఆమె పుట్టింటికి వచ్చి తన ఆస్తి విషయంలో గొడవకు దిగింది. తల్లి, చెల్లెలిని గాయపరిచింది.

daughter Gone before the wedding present property deliberately went into conflict at kota nirmal
అప్పుడు పెళ్లికి ముందు వెళ్లిపోయింది..ఇప్పుడు ఆస్తి కోసం గొడవకు దిగింది
author img

By

Published : Jul 11, 2020, 7:06 PM IST

నిర్మల్ జిల్లా కౌఠ గ్రామానికి చెందిన మంజూష దౌర్జన్యాలపై ఆమె తల్లిదండ్రులు బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికి రెండు రోజుల ముందు మంజుష.. తాను ప్రేమించిన రాజుతో పారిపోయినట్టు గత నెల ఆమె తల్లిదండ్రులు బాసర పోలీసులను ఆశ్రయించారు.

శనివారం రాజు, అతని తండ్రి మాధవరావ్​లతో కలిసి మంజుష తన పుట్టింటికి వచ్చి ఆస్తి విషయంలో గొడవకు దిగింది. ఈ క్రమంలో తన తల్లితో పాటు చెల్లెల్ని గాయపరిచింది. తమను కాదని వెళ్లిపోయిన మంజుష వారి అండ చూసుకుని తమపై దాడి చేసిందని తల్లిదండ్రులు వాపోయారు.

గుట్టుగా బతుకుతున్న తమను సోషల్ మీడియా ద్వారా రాజు, అతని తండ్రి మాధవరావులు అల్లరిపాలు చేస్తున్నారని పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : కరోనా పాజిటివ్​ ఉన్న వ్యక్తి సమాచారం ఎలా వస్తోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.