కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండో రోజు కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు సడలింపు ఉండటం వల్ల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు జనాలు భారీగా రోడ్లపైకి వచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా కొత్త, పాత బస్టాండ్ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.
ఉదయం 10 గంటల తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ప్రజలను ఇళ్లకు పంపించారు. దుకాణాలన్నీ మూసివేయడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ పరిస్థితులను కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఇంఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్