నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో పదేళ్లుగా ఉంటున్న ఓ ఆవును గ్రామస్థులంతా భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. అనారోగ్య కారణాలతో ఆ గోవు ఇవాళ మరణించింది. తామంతా భక్తి భావంతో కొలుచుకునే గోవుకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రతువులు నిర్వర్తించారు ఆ గ్రామస్థులు.
గోవు కళేబరానికి స్నానం చేయించి, కాషాయ వస్త్రం కప్పి ఎడ్లబండిపై మేళతాళాలతో ఊరేగించారు. చిన్నా పెద్దా అంతా గోమాతకి జై అంటూ నినదిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పండితుడి వేద మంత్రాల నడుమ అంత్యక్రియలు జరిపారు.
ఇదీ చదవండి : తొలిసారి గ్రేడింగ్ విధానంలో ఏపీ ఇంటర్ ఫలితాలు