ETV Bharat / state

గిరిజనులకు భూహక్కులు కల్పించాలంటూ సీపీఐ ధర్నా - నిర్మల్​ జిల్లాలో భూహక్కుల కోసం సీపీఐ ధర్నా

గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్మల్​ జిల్లా సీపీఐ కార్యదర్శి విలాస్ డిమాండ్​ చేశారు. భూమిలేని వారికి మూడు ఎకరాలు కేటాయించాలంటూ కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అటవీ హక్కుల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.

CPI dharna  at nirmal collectorate office
గిరిజనులకు భూహక్కులు కల్పించాలంటూ సీపీఐ ధర్నా
author img

By

Published : Jan 11, 2021, 8:42 PM IST

పోడు భూములకు పట్టాలిస్తామన్న హామీని సీఎం నెరవేర్చాలని నిర్మల్​ జిల్లా సీపీఐ కార్యదర్శి విలాస్​ కోరారు. గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. సీపీఐ, గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముందు ఆందోళన నిర్వహించారు. ఎనభై ఏళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి.. భూమిలేని గిరిజనులకు మూడెకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు వారిపై ఎలాంటి కేసులు పెట్టకూడదని కోరారు. ఆదివాసీలుండే ప్రాంతాలకు సాగునీరు, మంచినీటి సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణ, కుంటాల రాములు, శంకర్,లక్ష్మణ్, గిరిజన సమాఖ్య నాయకులు మెస్రం కాంతారావు, వెడమ లక్ష్మణ్, తుకారాం, తొడసం పాండు, గిరిజాబాయి, గెడం జారూబాయి, లచ్చుబాయి, అమృత్ రావు, వంద మంది గిరిజనులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మరింత సులభంగా ధరణి పోర్టల్.. సమీక్షలో సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.