నిర్మల్ జిల్లా బాసరలో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు పోలీసులు కలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతోంది ఎస్పీ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడం, నేరాల నియంత్రణకై ఈ తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సోదాల్లో 100 మంది పోలీసులు పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి