ETV Bharat / state

రాజ్యంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలి: కలెక్టర్ - రాజ్యంగ దినోత్సవం 2020

నిర్మల్ కలెక్టరేట్‌లో రాజ్యంగ దినోత్సవాన్ని కలెక్టర్ నిర్వహించారు. అందరూ రాజ్యంగానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించుకున్నామని గుర్తు చేశారు. రాజ్యంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

constitutional day celebrations in nirmal collectorate
రాజ్యంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలి: కలెక్టర్
author img

By

Published : Nov 26, 2020, 7:29 PM IST

భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కోరారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించుకొని... 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నామని ఆయన గుర్తు చేశారు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగంలో పౌరులందరికీ సమాన హక్కులు, సమన్యాయం కల్పించుకున్నామని పేర్కొన్నారు.

ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ సమానత్వంతో ఎదిగేందుకు... భావప్రకటన స్వేచ్ఛను పొందేందుకు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అన్ని కులాలు, మతాలు ఐక్యతతో ఉండేందుకు, జాతీయ సమగ్రతను పరిరక్షించే విధంగా రాజ్యాంగం రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

constitutional day celebrations in nirmal collectorate
రాజ్యంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలి: కలెక్టర్

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాఠోడ్ రమేశ్, కరీం, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శంకరయ్య, రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్​ పోరు: గడపగడపకు కారు... గల్లీల్లో రోడ్​షోల జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.