ETV Bharat / state

భూమాయపై కొత్తపోచంపాడ్ గ్రామస్థుల ఆందోళన - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నష్టపోయాం

న్యూపోచంపాడ్‌లో భూమాయ కొనసాగుతోంది. ఓ ప్రముఖ నేత, రెవెన్యూ అధికారి కలిసి బినామీ వ్యక్తుల పేరిట పట్టాలు సృష్టిస్తున్నారు. విషయం తెలిసిన కొత్తపోచంపాడ్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా సర్వేలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ భూమిని వదులుకునేది లేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

Concern of Kota Pochampad village over land at nirmal
భూమాయపై కొత్తపోచంపాడ్ గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Jul 19, 2020, 4:53 PM IST

భూమాయపై కొత్తపోచంపాడ్ గ్రామస్థుల ఆందోళన

నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రముఖ నేతలకు లబ్ధి చేకూర్చేలా.. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని అధికారులు ధారాదత్తం చేస్తున్నారని.. న్యూపోచంపాడ్‌ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన పోచంపాడ్‌ గ్రామానికి.. అప్పటి ప్రభుత్వం నిర్మల్ సమీపంలో జాతీయ ప్రధాన రహాదారి పక్కనే న్యూపోచంపాడ్‌ పేరిట పునరావాసం కల్పించింది. దాదాపుగా 120 కటుంబాలు కలిగిన గ్రామానికి అవసరాల నిమిత్తం 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూమిని గ్రామస్థులు పశువుల మేతకు తదితర అవసరాలకోసం వినియోగించుకుంటున్నారు.

గ్రామస్థులకే ఇవ్వాల్సి ఉంది

ప్రాథమిక నిబంధనల ప్రకారమైతే పూర్తి స్థాయిలో న్యూపోచంపాడ్‌ గ్రామస్థులకే ఆ భూమిని ఇవ్వాల్సి ఉంది. గ్రామ అవసరాల కోసం వినియోగించుకోవాలి కానీ.. ఎవరూ తీసుకోవద్దని ఏళ్ల కిందటనే తీర్మాణించుకోవడంతో ఇప్పటిదాకా ఏ సమస్య తలెత్తలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత భూముల ధరలకు రెక్కలు రావడం వల్ల ఆ భూమిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఓ ప్రముఖ నేత, ఓ రెవెన్యూ అధికారి కుమ్మక్కై... బినామీ వ్యక్తుల పేరిట పట్టా అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం డబ్బులు అందలేదు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇళ్లు, పంట భూములు నష్ట పోయామని... పరిహారం డబ్బులు ఇప్పటికీ అందలేదని, ఉద్యోగం కల్పిస్తామన్న హామీ సైతం బుట్టదాఖలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా గ్రామానికి కేటాయించిన భూమిని సొంతం చేసుకోవాలనుకోవడం దారుణమని వాపోతున్నారు. సర్వే చేసేముందు పక్క నుండే స్థల యజమానులకు గానీ... పంచాయతీలో గానీ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. కేవలం ఒకరిద్దరి ప్రయోజనం కోసం వందకు పైగా కుటుంబాలకు ఉపయోగపడే స్థలాన్ని ఎలా ఫణంగా పెడతారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా నిర్లక్ష్యం చేస్తున్నారని.. ప్రాణం కోల్పోయినా భూమిని మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చూడండి : 'మొదటి రోజు పీవీ ప్రసంగాలను ప్రసారం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.