ETV Bharat / state

ముథోల్ సర్పంచ్​ నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు

author img

By

Published : Aug 10, 2020, 8:00 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్​ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న గ్రామ సర్పంచ్​ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామానికి సుమారు రూ.రెండు కోట్ల నిధులు మంజూరైతే సగానికిపైగా సర్పంచ్​ తన అకౌంట్​లోకి బదిలీ చేసుకున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు.

complaint on mudhole sarpanch on money laundering case
ముథోల్ సర్పంచ్​ నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు

నిర్మల్ జిల్లా ముథోల్​ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న గ్రామ సర్పంచ్​ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామానికి సుమారు రూ.రెండు కోట్ల నిధులు మంజూరైతే సగానికిపైగా నిధులను సర్పంచ్ తన సొంత అకౌంట్​లోకి బదిలీ చేసుకున్నారని ఆరోపించారు.

నిధుల దుర్వినియోగంలో విద్యుత్​ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్, ముథోల్ ఏఈ, పంచాయతీ శాఖ ఏఈ, జిల్లా పంచాయతీ అధికారి సహకారముందని అదనపు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేస్తూ గ్రామ సర్పంచ్​గా వేతనం పొందడమెలా సరైనదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్​ను వెంటనే తొలగిస్తూ, సహకరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ అదనపు కలెక్టర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి:- ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.