నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణంలో ఇటీవల పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ కోసం తీసుకున్న వాహనాలను పరిశీలించారు. రహదారిపై నడుస్తూ కార్మికుల పని తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతను పాటిస్తూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచాలనేదే తన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల్లో సిబ్బంది ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఉద్యోగ సంఘాలతో ముగిసిన అధికారుల చర్చలు