రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లకు తరలించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. లక్ష్మణచాంద మండలంలోని చామన్ పల్లి, చింతలచాంద గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. కరోనా నిబంధనలను గుర్తు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాఠోడ్ రమేశ్, తహసీల్దార్ కవితారెడ్డి తదితరులున్నారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి రాష్ట్రంలో కొవిడ్ టీకా మొదటి డోసు నిలిపివేత