ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులను, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్, ల్యాబ్, ఓపీ వార్డు, పేషెంట్ వెయిటింగ్ హాల్ పనులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. వారితో పాటు వైద్యాధికారులు దేవేందర్ రెడ్డి, రజని తదితరులున్నారు.
ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష