సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్ల్లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు నో మాస్క్ నో టికెట్, నో మాస్క్ నో పెట్రోల్ నిబంధనను అమలు చేయాలని... నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని పేర్కొన్నారు.
సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్ల యజమానులతో కొవిడ్ నిబంధనలపై కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అర్హులందరూ వాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. వైరస్ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పారు.
ఇదీ చదవండి: భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల.!