నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, వసతుల కల్పనపై రోగులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వస్తున్న రోగుల సంఖ్య, ప్రసవాల గురించి వైద్య సిబ్బందితో మాట్లాడారు.
ఆసుపత్రిలో వైద్య సేవలపై మార్పు రావాలని, సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. ఆసుపత్రిలో 80 శాతం సాధారణ ప్రసవాలు జరగాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!