ETV Bharat / state

'వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి' - Collector Musharraf Farooqi latest news

నిర్మల్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. ఈ నెల 18నుంచి 25కేంద్రాల్లో టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్​పై అధికారులతో సమావేశం నిర్వహించారు.

Collector who visited health centers on vaccination
వ్యాక్సినేషన్​పై ఆరోగ్య కేెంద్రాలు సందర్శించిన కలెక్టర్​
author img

By

Published : Jan 12, 2021, 10:40 PM IST

నిర్మల్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో పరిశుభ్రత, నిబంధనలు పాటించాలన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 16న నిర్మల్, భైంసా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతగా కేంద్రానికి 30మంది చొప్పున మూడింటిలో 90మందికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు.

తొలి విడత..

ఈ నెల 18నుంచి 25కేంద్రాల్లో టీకాలు వేయడం జరుగుతుందన్నారు. తొలి విడత ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండోసారి మున్సిపల్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసు, రెవెన్యూ, ఫ్రంట్​లైన్ ఉద్యోగులకు ఇవ్వాలన్నారు.

అపోహ వద్దు..

మూడో విడతలో 50ఏళ్ల కంటే తక్కువున్న వారికీ, ప్రజలందరికీ టీకా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని స్పష్టం చేశారు.

టీకా పట్ల ప్రజలెవరూ అపోహలు నమ్మొద్దు. కేంద్రాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి. అందుకు పోలీసు భద్రత ఏర్పాటు చేయాలి.

-ముషర్రఫ్ ఫారూఖీ, కలెక్టర్

ఇదీ చూడండి: 'వ్యాక్సినేషన్​లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.