ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్రాలు ధర్నాలు చేయడం సిగ్గుచేటని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ధర్నాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లులో పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. ముందుగా సాయిబాబా ఆలయంలో సతీమణి మల్లు నందినితో కలిసి పూజలు నిర్వహించారు.
అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోతే.. అమెరికా, పాకిస్థాన్ ప్రభుత్వాలు వచ్చి కొనుగోలు చేస్తాయా..? అని భట్టి నిలదీశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి దుస్థితి ఏనాడు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు పక్కనపెటి.. రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: