నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని తాండ్ర(జి) గ్రామానికి చెందిన పురస్తు రాజమణి గత నెల రోజుల క్రితం కరోనాతో మరణించింది. గతంలోనే తండ్రి కూడా చనిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరి మృతితో వారి కూతురు అనాథగా మారిందని బాలల సహాయ వాణికి సమాచారం అందింది. వెంటనే వారు గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వోస శ్రీనివాస్ తెలిపారు. 18 ఏళ్లు నిండి డిగ్రీ పూర్తయ్యే వరకు ఉచిత విద్య, వసతితో పాటు మూడేళ్ల పాటు నెలకు రెండు రూపాయలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూమేష్, సామాజిక కార్యకర్తలు నరేందర్, మమత, చైల్డ్‌లైన్ సభ్యులు రాజ్ కుమార్, వార్డు సభ్యులు రవి, అంగన్వాడీ టీచర్ గోదావరి, వనజ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ