నిర్మల్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఛత్రపతి విగ్రహాన్ని పూలతో అలంకరించారు.
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో పాటు తెరాస నేతలు శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు శత్రువులతో వీరోచితంగా పోరాడిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. ఆయన చూపిన ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు.
- ఇదీ చూడండి : అస్వస్థతకు గురైన 26 మంది విద్యార్థుల్లో ఒకరికి కరోనా