నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సందర్శించారు. చంద్రబాబు కోడలు బ్రహ్మిని, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర... సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్కు సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం జరిపించారు. బాలకృష్ణ మరో మనవడు ఆర్యన్కూ అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూజలు చేపట్టారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలోకి 'బ్యాండ్ బాజా బరాత్' ముఠా.. పోలీసులు అలర్ట్