ETV Bharat / state

గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆకస్మిక తనిఖీ - telangana news

ఫిబ్రవరి 1న గురుకుల, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(హైదరాబాద్) రాష్ట్ర కార్యదర్శి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సిబ్బందికి జాగ్రత్తలు, సూచనలు ఇస్తూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రణాళికా బద్ధంగా పాఠాలను బోధించాలని తెలిపారు.

CH Ranakumar's surprise inspection at Gurukulam in Nirmal
రాష్ట్ర కార్యదర్శి గురుకులాల ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Jan 22, 2021, 8:47 PM IST

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(హైదరాబాద్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ నిర్మల్​లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఫిబ్రవరి 1న గురుకుల, కళాశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తూ, సిబ్బంది అప్రమతంగా ఉండాలని సూచించారు.

ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, వెబినార్ తరగతుల హాజరు పట్టికలు, యాదగిరి విద్యా టీ-శాట్ తరగతుల హాజరు పట్టికల్ని ఆయన పరిశీలించారు. గురుకుల విద్యాలయాన్ని పూర్తిస్థాయిలో కలియ తిరిగారు. తరగతి గదులు, టాయిలెట్స్​, కిచెన్, డార్మెటరీలను పరిశీలించారు. గురుకులాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి.. ప్రణాళికబద్ధంగా పాఠాలను బోధించాలని తెలిపారు.

ప్రతి ఉపాధ్యాయురాలిని పలకరిస్తూ వారికి విషయాల వారీగా తగిన మార్గదర్శకాలను ఇచ్చారు. గురుకుల మౌలిక సదుపాయాలను పరిశీలిస్తామని అన్నారు. ఆయన వెంట సంస్థ డిప్యూటీ ఇంజినీర్ యూసఫ్, నిర్మల్ ప్రిన్సిపాల్ నీరడి గంగా శంకర్, సంస్కృత ఉపన్యాసకులు బి. వెంకట్, అస్టెంట్ ప్రిన్సిపాల్ రోహిణి, కళాశాల సహాయకురాలు కల్పన ఉన్నారు.

ఇదీ చూడండి: 'కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.