ETV Bharat / state

వందకొట్టు.. వంకాయ పట్టు

కూరగాయలకు రాజు ఎవరంటే... ఠక్కున చెప్పేసే పేరు వంకాయ. అయితే ఆ వంకాయ ఇప్పుడెంతో ప్రియమైంది. లొట్టలేసుకుని తినేసే వారిప్పుడు ఒక్కసారి ఆలోచించేస్తున్నారు. షాపుకెళ్లి వంకాయలు కిలో ఎంతని అడిగే... "వందకొట్టు.. వంకాయ పట్టు" అనే సమాధానం వినిపిస్తోంది.

author img

By

Published : Sep 11, 2019, 12:21 PM IST

వంద కొట్టు.. వంకాయ పట్టు
వంద కొట్టు.. వంకాయ పట్టు

కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్లో టమాట తప్ప మిగతా కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఇక వంకాయ సెంచరీకి చేరువైంది. నిర్మల్​ జిల్లా కేంద్రంలో కిలో వంకాయ ధర రూ. 80 నుంచి రూ.100 పలుకుతోంది. ఇతర వాటితో పోలిస్తే వంకాయ ధర పైపైకి ఎగబాకుతోంది. ఈ కూరగాయల రాజును కొనాలంటేనే వినియోదారులు జంకుతున్నారు. దిగుబడి తగ్గడం, గణేశ్​ నవరాత్రి ఉత్సవాల సమయంలో పెరిగిన నిత్యాన్నదానాల కారణంగా వంకాయ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఇతర రోజుల్లో కిలోకు 30 రూపాయలు ఉండే ధర ఇప్పుడు మూడు రేట్లు పెరిగిపోయింది.

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro:TG_ADB_32_10_VANKAYA_AVBBB_TS10033..
రూ,, వంద కొట్టు.. వంకాయ పట్టు
వహారీగా పెరిగిన ధరలతో వినియోగదారుల బెంబేలు..
తాజా కూరలు రాజా ఎవరంటే..ఇంకా చెప్పాలా..వంకాయే నండి.అంటూ ఓ సినీకవి వంకాయ ప్రాశస్యం దాని రుచిని వివరిస్తూ పాట రాశారు. నిజమే. వంకాయ నిత్య జీవితంలో ఎనలేని పాత్ర ఉంది. సాధారణ మధ్య తరగతి ఏదైనా వంటకాల్లో విరివిరిగా వంకాయను ఉపయోగిస్తుంటారూ.అయితే నిర్మల్ జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా ఈ కాయగూర వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. కిలో 80 నుండి 100 వరకు ధర పలుకుతుంది. ఇతర కూరగాయలతో పోలిస్తే ఇది అసాధారణంగా ఉంది. వంకాయ దిగుబడి కాస్త తగ్గడం, అదే సమయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో పెరిగిన నిత్యాన్నదానాలు కారణంగా వంకాయను డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు సైతం అమాంతంగా పెరిగిపోయాయి. ఇతర రోజుల్లో కిలోకు 30 రూపాయలు ఉండే ధర ఇప్పుడు రెందురేట్లకు పైగా ధర పెరిగింది.దీంతో వంకాయ పీతిపాత్రులు దీన్ని కొనాలంటే వెనుకడుగు వొస్తున్నారు.
బైట్
1.నరేష్ , అధ్యాపకుడు..
2.రమేష్ , కూరగాయల వ్యాపారి..
3.కూరగాయల వ్యాపారి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.