నిర్మల్ జిల్లా తనూర్ మండల కేంద్రంలో నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందాడు.కుబీర్ మండలంలోని పర్డి(బి) గ్రామానికి చెందిన లక్ష్మీ సాయినాథ్ కుమారుడు సన్నిథ్ గత మూడు సంవత్సరాల నుంచి తనూర్ మండల కేంద్రంలో గల తన మేనమామ వద్ద ఉంటున్నాడు. బాలుడు వాగ్దేవి పాఠశాలలో ఐదో తరగతి చదువుకుంటున్నాడు. ఈ రోజు పాఠశాలకు సెలవు దినం కావడం వల్ల మేనమామతో పొలానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే గుంతలో నుంచి బయటకు తీసి చూడగా సన్నిథ్ కొనఊపిరితో ఉండటంతో వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవీ చూడండి: మద్యం మత్తులో నాలుగేళ్ల కుమారున్ని హతమార్చిన తండ్రి