సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల భాజపా అభ్యర్థి రఘునందన్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ భాజపా కార్యకర్తలు నిర్మల్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నానిర్వహించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు దుబ్బాక ఎన్నికల్లో అరాచకం సృష్టిస్తున్నారని పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్ విమర్శించారు.
సర్కారుకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమన్నారు. వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, కమల్ నయన్, ఒడిసెల అర్జున్, కొండాజీ శ్రవణ్, అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దుబ్బాకలో పోలీసులది పక్షపాత వైఖరి: దాసోజు శ్రవణ్