ETV Bharat / state

'బీడీ కార్మికుల బతుకులను రోడ్డుకీడుస్తున్న కేంద్ర ప్రభుత్వం' - Nirmal District Latest News

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగాకు ఉత్పత్తుల చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పాలనాధికారి కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Beedi workers have raised concerns in front the Nirmal District Collectorate to withdraw the KOFTA Act
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికులు ఆందోళన
author img

By

Published : Feb 25, 2021, 5:46 PM IST

కేంద్రం తీసుకొచ్చిన పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్​టీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న డిమాండ్​ చేశారు. బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

90 శాతం మంది మహిళలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కోఫ్టా చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.

రోడ్డుకీడుస్తోంది..

కేంద్రం పొగాకు ఉత్పత్తుల చట్టం తీసుకొచ్చి బీడీ కార్మికుల బతుకులను రోడ్డుకీడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యి బీడీలకు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 23 శాతం పన్ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం కనికరం లేకుండా బీడీ పరిశ్రమలు నిర్వీర్యం చేయడం ఎంత వరకు న్యాయం? అని ప్రశ్నించారు. వారి డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు.

ఇదీ చూడండి: 'ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.