ఆలయ వేద పండతులు రాత్రి ఒంటి గంటకు మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు సేవ నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి మహా అభిషేకం, అలంకరణ చేశారు. వేకువజామున 5 గంటలకు అక్షరాభ్యాస పూజలు ప్రారంభించారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అక్షరాభ్యాస మండపాలను పెంచినప్పటికీ అమ్మవారి దర్శనానికి 4 నుండి 5 గంటల సమయం పడుతోంది. వసంత పంచమి, శ్రీ పంచమి పురస్కరించుకొని మన రాష్ట్రం నుండే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు, వసతి గృహాలు, ప్రైవేట్ లాడ్జిలు భక్తులతో నిండిపోయాయి.