ETV Bharat / state

పల్లె విద్యార్థులకు బాసటగా బాసర ట్రిపుల్ ఐటీ - iiit

పల్లె విద్యార్థులకు బాసటగా నిలిచే బాసర ట్రిపుల్ ఐటీలో 2019 - 2020 విద్యాసంవత్సర ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి మే 24 వరకు ఆన్​లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ట్రిపుల్​ ఐటీ అధికారులు తెలిపారు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సుల్లో చేరేందుకు ప్రతిభ గల విద్యార్థులను ట్రిపుల్​ ఐటీ ఆహ్వానిస్తోంది.

బాసర ట్రిపుల్ ఐటీ
author img

By

Published : Apr 26, 2019, 8:57 PM IST

నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ ఐటీలో 2019-20 విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్​ విడుదలైంది. పదోతరగతి జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. కేవలం అభ్యర్థులు కేవలం ఆన్​లైన్​ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీసేవా, టీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 150 రూపాయలు, బీసీ, ఓబీసీ విద్యార్థులు 200 రూపాయలు చెల్లించాలి. రిజిస్ట్రేషన్​ ఫీజు కింద బీసీ, ఓసీ విద్యార్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 500 చెల్లించాలి.

బాసర ట్రిపుల్ ఐటీ

సమాన గ్రేడ్​ పాయింట్లుంటే

ప్రభుత్వం నాన్​ రెసిడెన్షియల్​, ఇతర జిల్లా పరిషత్​ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వెనుకబాటు సూచీ కింద 0.4 పాయింట్లు జతచేస్తారు. సీట్ల కేటాయింపు సమయంలో సమాన గ్రేడ్​ పాయింట్లుంటే మొదట గణితం, జనరల్​ సైన్స్, ఇంగ్లీష్, సాంఘికశాస్త్రం, తెలుగులో మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.

రిజర్వేషన్​ విధానం

ట్రిపుల్ ఐటీలో స్థానికంగా 85 శాతం కేటాయించగా మిగిలిన 15 శాతం ఓపెన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్​లోని మెరిట్ విద్యార్థులకు, ఎన్​ఆర్ఐ కోటా విద్యార్థులకు. బీసీ-ఏ కు 15 శాతం , బీసీ - బీ కి 10 శాతం. బీసీ - సీ కి 1 శాతం, బీసీ - డీ కి 7 శాతం. బీసీ - ఈకి 4 శాతం. దివ్యాంగులకు 2 శాతం. ఎన్సీసీ స్పోర్ట్స్​కు 0.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు ఎన్ఆర్​ఐ కోటా కింద 20 సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

ప్రత్యేక వసతులు

ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు ఒక ల్యాప్ టాప్, యూనిఫారమ్, క్రీడా దుస్తులతో పాటు ఉచిత భోజన వసతి ప్రభుత్వమే కల్పిస్తుంది. కళాశాలలో 30 పడకల ఆస్పత్రితో పాటు యోగా తరగతులు నిర్వహిస్తారు. ఫీజురియంబర్స్​మెంట్​కు అర్హులుకాని విద్యార్థులకు కళాశాలలోని బ్యాంకుల నుంచి విద్యా రుణాలు అందేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారు.

ఫీజు వివరాలు

ఫీజు రీయింబర్స్​మెంట్ పథకానికి అర్హులు కాని విద్యార్థులు మొదటి రెండేళ్లు ఏడాదికి 30 వేల రూపాయలు ఆ తర్వాత నాలుగేళ్లకు ఏడాదికి 40 వేల రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

బాసర ట్రిపుల్​ ఐటీలో ఈ ఏడాది 1000 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈ సంవత్సరం కళాశాల తరఫున 500 పొడిగింపు ప్రతిపాదనను త్రిబుల్ ఐటీ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఏటా మూడు వేల మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే అవకాశం, వసతులు ఇక్కడ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.