నిర్మల్ జిల్లాలోని వెంకటాపూర్ గ్రామంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ స్థాయిలో ఉన్నామన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధ్యాయిలు, స్థానిక నాయకులు... విద్యార్థులు స్కూలుకి వెళ్లేలా చూడాలని మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: అవినీతిపై హైతీలో మిన్నంటిన ఆగ్రహ జ్వాల