నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆయుధ కర్మాగారంలో అదనపు ఎస్పీ రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసు వాహనాలకు సైతం ప్రత్యేకంగా పూజలు జరిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు, ప్రజలకు అదనపు ఎస్పీ రాంరెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయాలకు ప్రతీకగా విజయదశమిని అభివర్ణించారు. ప్రజలంతా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి.. పెద్దల నిబంధనకు కట్టుబడి.. పండుగలు చేసుకోని ఓ గ్రామం