ప్రవీణ్ కుమార్ ఉన్నతమైన స్థానంలో ఉండి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. విద్యార్థులను ఉన్నతమైన స్థాయికి తీర్చిదిద్దే గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని పేర్కొన్నారు.
రాముడు, కృష్ణుడు, గౌరీ, వినాయకున్ని పూజించబోమని ప్రతిజ్ఞ చేయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్బ్యాండ్ వద్ద అంబెడ్కర్ విగ్రహానికి దళిత మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మత విశ్వాసాలను కించపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నాలుగోరోజు శ్రీకృష్ణావతారంలో యాదాద్రీశుడు