నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆత్మ నిర్భర్ భారత్ సందేశ్ కరపత్రాలను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు విడుదల చేశారు. గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణంపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వివరించేందుకే ఆత్మ నిర్భర్ భారత్ సందేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు కార్యకర్తల చొప్పున ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ సంక్షేమ పథకాలను వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, భాజపా కార్యకర్తులు తదితరులు పాల్గొన్నారు.