నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఆదివాసీలు వినతిపత్రం అందజేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న తమకు హక్కు పత్రాలివ్వాలంటూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను ప్రభుత్వం ఖాళీ చేయింస్తోందని ఆరోపించారు. అధికారులు ఈ విషయంపై ఇప్పటికైనా స్పందించి అర్హులైన ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః ప్రగతిభవన్ ముట్టడిని కట్టడి చేసిన పోలీసులు