Woman Doctor Commited to Suicide: కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా జీవితంలో రాణించాలనే సంకల్పంతో కొందరు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఆ తర్వాత తాము ఎంచుకున్న లక్ష్యం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో గమ్యస్థానం వైపు అడుగులు వేస్తున్నారు. తమ సంకల్ప బలం ముందు ఏదైనా తక్కువేనని నిరూపిస్తున్నారు. అలా తాము అనుకున్న లక్ష్యానికి చేరుకుంటున్నారు. కానీ ఉన్నత స్థానంలో స్థిరపడ్డాక జీవితం గురించి ఆలోచించకుండా క్షణిికావేశంలో తాము తీసుకునే నిర్ణయాల వల్ల అర్థాంతరంగా చనువు చాలిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ వైద్యురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలో యువ వైద్యురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. స్థానిక పట్టణంలోని ఏఎన్‌రెడ్డి కాలనీలో బీనా(36) అనే వైద్యురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. డాక్టర్స్ లైన్లో ఉన్న బాలాజీ ఈఎన్టీ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఏమయిందో ఏమో కానీ సోమవారం మధ్యాహ్నం సమయంలో బీనా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తదుపరి ఆమె తాను పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ ద్వారా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందించింది. వెంటనే విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది బీనా నివాసం ఉండే ఇంటికి చేరుకున్నారు.
ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న వైద్యురాలు బీనాను వెంటనే అంబులెన్స్‌లో దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు బీనాను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే యువవైద్యురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బీనా ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'ఈ రోజు మధ్యాహ్నం వీణ అనే వైద్యురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మొదట ఆమెకు ప్రాథమిక చికిత్స అందించాం. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించాం. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిన వివరాలు తెలియరాలేదు. బాధితురాలి ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది. ఆమె ప్రాణాన్ని కాపాడడం కోసం మొదటగా చేయాల్సిన ప్రాథమిక చికిత్సను అందించి ఆమెను కాపాడగలిగాం.'-ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు
ఇవీ చదవండి: