వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. పట్టణంలోని పురాతన శివాలయంలో వాన దేవుడి అనుగ్రహం కోసం 24 గంటలు వేద మంత్రోచ్ఛారణలతో అభిషేకం చేశారు. భోళా శంకరుడి తలపై ఉన్న గంగను భూమిపైకి వదిలి ప్రజలు, రైతులు పండించే పంటలను కాపాడాలని ప్రార్థించారు. ఆదివారం 24 గంటల పాటు ఆలయ గర్భగుడిలోని శివ లింగాన్ని నీటిలో ఉంచి పూజలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : నీట మునిగిన పట్టాలు.. రైల్లోనే వందలాది ప్రయాణికులు