ETV Bharat / state

'సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడికి 14రోజుల రిమాండ్​' - nirmal sp

రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్​ను అరెస్ట్​ చేశామని నిర్మల్​ ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయిలు వసూలు చేశారని, డబ్బులు తిరిగివ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఫిర్యాదులపై అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

'సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడికి 14రోజుల రిమాండ్​'
author img

By

Published : Sep 30, 2019, 3:30 PM IST

రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదన్​ను అరెస్ట్​ చేసినట్లు నిర్మల్​ ఎస్పీ శశిధర్​రాజు వెల్లడించారు. కడెం మండలం బెల్లాల్​ గ్రామానికి చెందిన సుధాకర్​ అనే వ్యక్తికి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని, డబ్బులు తిరిగివ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఎస్పీ తెలిపారు. భూవ్యవహారంలోనూ బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈనెల 28న సూర్యాపేటలోని కొత్తపల్లి టోల్​ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. న్యాయస్థానం భూమన్న యాదవ్​కు 14 రోజుల రిమాండ్​ విదించిందన్నారు. ఈయనపై కడెం, ఖానాపూర్​ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ శశిధర్​రాజు పేర్కొన్నారు.

'సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడికి 14రోజుల రిమాండ్​'

ఇవీచూడండి: సర్పంచుల సంఘం అధ్యక్షుని ఆచూకీ ఏది?

Intro:TG_ADB_31_30_SP PRESS MEET_AVB_TS10033
సర్పంచుల సంఘం అధ్యక్షుడికి 14 రోజులు రిమాండ్..
సచివాలయం లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన సర్పంచుల సంఘం అధ్యక్షుదు అరెస్ట్..
14 రోజుల రిమాండ్..
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నిర్మల్ జిల్లా ఎస్పీ...
సచివాలయం లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాన్ని భూమన్న యాదవ్ ను అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు .నిర్మల్ లోని డిఎస్పీ కార్యాలయంలో లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి తో పాటు పలువురి వద్ద సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సౌదీ మన యాదవ్ డబ్బులు తీసుకున్నట్లు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పించ పోవడంతో పాటు తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించాడని తెలిపారు. దీంతో భూమన్న యాదవ్ ను ఈనెల 28న సూర్యాపేటలోని కొత్తపల్లి టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు ఈయనపై కడెం , ఖానాపూర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. భూమన్న యాదవ్ ను కోర్టులో హాజరుపరచగా అతన్ని 14 రోజుల రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.
బైట్.. శశిధర్ రాజు..నిర్మల్ ఎస్పీ..

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాద్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.