ETV Bharat / state

YS Sharmila speech: బీసీలను ఇంకా కులవృత్తులకే పరిమితం చేస్తున్నారు: షర్మిల

తెలంగాణలో బీసీలకు న్యాయం జరగడం లేదని వైఎస్సార్​​ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila speech) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంటే.. బీసీలను మాత్రం కులవృత్తులకే పరిమితం అవ్వమంటున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కోస్గిలో వైఎస్సాఆర్​ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవ సభలో షర్మిల పాల్గొన్నారు.

YS Sharmila speech
కోస్గిలో వైతెపా సమావేశం
author img

By

Published : Oct 3, 2021, 7:34 PM IST

Updated : Oct 3, 2021, 7:52 PM IST

'ఆటాపాటా మా ఇంట్లో.. మాపటి భోజనం మీ ఇంట్లో అన్నట్లుంది' తెలంగాణలో తెరాస పాలన అని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila speech) వ్యాఖ్యానించారు. పాలకులే బీసీలు ఎదగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణ పేట జిల్లా కోస్గిలో వైఎస్సార్​​ తెలంగాణ పార్టీ ఆధ్యర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో షర్మిల(YS Sharmila speech) పాల్గొన్నారు. తెరాస పాలనలో బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

బీసీలను ఇంకా కులవృత్తులకే పరిమితం చేస్తున్నారు: షర్మిల

'పాలకులే తెలంగాణలో బీసీలు ఎదగకుండా చేస్తున్నారు. బర్రెలు, గొర్రెలు ఇచ్చి వాళ్లను చదువులకు దూరం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దళిత బంధులాగే బీసీ బంధు అని ప్రజలను మభ్యపెడుతున్నారు. రూ.2వేల పింఛన్లు ఇస్తే నేతన్నలు యజమానులు అవుతారా? మదిరాజ్​లను రాజులను చేస్తా అన్నారు. చేప పిల్లలు ఇస్తే రాజులైనట్టేనా. ఏ పథకం అయినా రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అక్కడ అమలవుతుంది. అయిపోగానే మాయమవుతుంది. కులవృత్తులను చేసుకొని బతకండి అనే నాయకులను మీరు ప్రశ్నించండి.. మీరెందుకు కులవృత్తులు చేసుకోరు అని.'

-వైఎస్​ షర్మిల, వైఎస్సార్​​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

ప్రపంచం ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంటే.. బీసీలు మాత్రం కులవృత్తులకే పరిమితం చేస్తున్నారని షర్మిల(YS Sharmila speech) ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పాలనలో బీసీలకు పెద్ద పీట వేశారని చెప్పుకొచ్చారు. చట్ట సభల్లో, మున్సిపాలిటీల్లో కేసీఆర్​.. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారన్న షర్మిల.. అసెంబ్లీలో బీసీలు 20శాతం కూడా లేరని వెల్లడించారు. వైఎస్సా​ర్​​ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధిక శాతం బీసీలకే ప్రాధాన్యం ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. స్టార్టప్​ ఇండియా లాగా.. స్టాండప్​ బీసీ అనే నినాదంతో పనిచేస్తామన్నారు. బీసీలను స్వయం సమృద్ధిగా చేయడమే లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Bhatti vikramarka: 'విద్యార్థి, నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడం దారుణం'

Last Updated : Oct 3, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.