నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని జక్కన్నపల్లి, పాతర్చేడ్ గ్రామాల శివారులోని ఓ ప్రాంతంలో జింక పిల్లను కుక్కలు వెంటాడుతుంటే జక్కన్నపల్లి గ్రామానికి చెందిన యువకులు రమేష్, నాగేశ్వర్ రెడ్డిలు కాపాడారు. కుక్కలను తరిమి జింక పిల్లను కాపాడి నర్వ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
నర్వ పోలీసు అధికారులు జింకపిల్లకు పశు వైద్యులతో చికిత్స చేయించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో నర్వ ఎస్సై నవీద్ , హెడ్ కానిస్టేబుల్ మనోహర్, కానిస్టేబుళ్లు రాజేశ్వర్ రెడ్డి, ఆనంద్, అనిత, రహమతుల్లా, అటవీశాఖ అధికారులు నవీన్, రాజులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉస్మానియాలోకి వర్షపు నీరు.. ఆందోళనలో రోగులు, వైద్యులు