నారాయణపేట జిల్లా కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య సదస్సు నిర్వహించారు. ఓటు విలువ, అభివృద్ధి జరగాలంటే ఎలాంటి నాయకున్ని ఎన్నుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. యువతి యువకులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ శేఖర్ సూచించారు. ఓటుపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఇవీ చూడండి: దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఇందూరు లోక్సభ ఎన్నిక