నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని పెద్ద కడుమూర్లో నాలుగేళ్ల క్రితం 18 లక్షలతో పశువైద్యశాల నిర్మించారు. కానీ పశువైద్యాధికారి నియామకం జరగలేదు. లక్షలు వెచ్చించి కట్టిన భవనం ఇప్పుడు నిరూపయోగంగా మారింది. పశు వైద్య సేవలు అందక పెద్ద కడుమూర్తో సహా సమీప గ్రామాల్లో పశుపోషణ రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వైద్యున్ని నియమించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: హాజీపూర్ గ్రామస్థుల నిరాహార దీక్ష భగ్నం