నారాయణపేట జిల్లా రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వల కొరత వేధిస్తోంది. ఫలితంగా పలువులు బాధితులు అవస్థలు పడుతున్నారు.
గత కొన్ని నెలలుగా జిల్లా ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య పెరుగుతోంది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు.. వివిధ ఆస్పత్రులకు తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రతి నెలా 100 నుంచి 150 వరకు ప్యాకెట్ల రక్తం సంచీలు అవసరం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేసి సేకరించేవారు.. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా రక్త దానం చేసేందుకు దాతలు వెనకడుగు వేస్తున్నారు. అపోహలు వీడాలని.. ఆరోగ్యవంతులు ఆరు నెలలకోసారి రక్తదానం చేయవచ్చనని వైద్యులు సూచిస్తున్నారు.
కొవిడ్ ప్రభావంతో గత 11 నెలల నుంచి రక్తదాన శిబిరాలు జరగడం లేదు. ఫలితంగా దేశవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గుముఖం పట్టాయి. అందువల్ల చాలా మంది ప్రాణాలను కాపాడలేకపోయాం. నేను ఇప్పటివరకు 14 సార్లు రక్తదానం చేశాను. అపోహలు వీడి రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలి.
-జయచంద్ర మోహన్, జిల్లా వైద్యాధికారి.
కొవిడ్ ప్రభావంతో రక్తదాతలు ముందురావడం లేదు. 15రోజులకోసారి రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం. రక్తదాతలు ఒకరి ప్రాణాలు నిలిపినవారవుతారని గుర్తుంచుకోవాలి.
- మాధవి, బ్లడ్‌బ్యాంక్ వైద్యురాలు.