నారాయణపేట జిల్లా కోస్గి మండలానికి చెందిన ఇలియాస్ అనే వ్యక్తి వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్లో నివాసముంటున్న ఆయన కొన్ని రోజులుగా సెలవుల్లో ఉండి సోమవారం విధుల్లో చేరేందుకు దిచక్రవాహనంపై బయలుదేరారు. ఆత్మకూరు నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతని వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బాధితుడి తలకు తీవ్రంగా గాయాలు కావటం వల్ల అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తోటి ఉద్యోగి మృతి చెందిన విషయం తెలియడం వల్ల ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బాధితుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.