నారాయణపేట జిల్లా మక్తల్‌లో వైద్యులు ఇంటింటికి తిరిగి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. తబ్లీగీ జమాతేకు వెళ్లి వచ్చిన వారిని కలిశారని పట్టణానికి చెందిన నలుగురిని అధికారులు నారాయణపేట క్వారంటైన్‌కి పంపారు. వైద్య పరీక్షల్లో వారికి నెగెటివ్ వచ్చిందని డాక్టర్ సిద్ధప్ప తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని పలు వీధులలో ఇంటింటికి తిరిగి వైద్యులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ