ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం​ పట్టివేత - నారాయణపేట జిల్లా వార్తలు

నారాయణపేట జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు చోట్ల కర్ణాటకకు తరలిస్తున్న 28 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

taskforce police caught pds rice in narayanapet district
అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం​ పట్టివేత
author img

By

Published : Aug 22, 2020, 10:37 PM IST

నారాయణపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. మద్దూర్​ మండలం నిడ్జింత గ్రామంలో అర్ధరాత్రి దాటిన తర్వాత అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిపోలీసులు పట్టుకున్నారు. తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిడ్జింత గ్రామం నుంచి ఆటోలో కర్ణాటక రాష్ట్రంలోని గురుమిట్కల్ తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

అలాగే మరికల్ మండలం తీలేరు గ్రామంలో అర్ధరాత్రి బొలెరో వాహనంలో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న 16 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం మరికల్ పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి పంచనామా నిర్వహించారు. నర్సాపురం గ్రామానికి చెందిన నరసింహులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాజర్​ తెలిపారు.

ఇవీ చూడండి: అంతర్రాష్ట్ర జూదగాళ్ల అరెస్టు.. 2 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.