ETV Bharat / state

పాఠశాలను హరితవనం చేసిన ఉపాధ్యాయులు - swacha patashala

హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నారాయణపేట జిల్లా లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేస్తున్నారు. సర్కారు బడిని పర్యావరణహితంగా, హరితవనంగా మార్చారు. బోధనలోనూ ఏమాత్రం తీసిపోకుండా... ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నారు.

పాఠశాలను హరితవనం చేసిన ఉపాధ్యాయులు
author img

By

Published : Aug 29, 2019, 10:33 AM IST

ఉపాధ్యాయ వృత్తి అంటే బోధించడమే కాదు... విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అని గుర్తు చేస్తున్నారు... నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. మొదట సొంత ఖర్చులతో పాఠశాలలోని చిన్న చిన్న సమస్యలు పరిష్కరించారు. తర్వాత దాతల సహకారంతో బడి రూపురేఖలే మార్చేశారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా... 2018-19 సంవత్సరానికి జిల్లాలో స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది.

గ్రామస్థుల సహకారంతో...

2018 జూన్​ నెలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్... తోటి ఉపాధ్యాయుల సహకారంతో 40 వేల రూపాయలు పోగుచేసి పాఠశాల భవనానికి రంగులు వేయించి, విద్యార్థులు స్ఫూర్తి పొందేలా నీతి వాక్యాలు రాయించారు. తర్వాత గ్రామస్థులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో సమస్యలు పరిష్కరించేందుకు చేయూతనివ్వాలని కోరారు. పూర్వ విద్యార్థుల చొరవతో కేవలం ఇరవై రోజుల్లో 3లక్షల రూపాయలు జమయ్యాయి. ఈ నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, గ్రంథాలయం గది, ప్రతి తరగతి గదిలో ఫ్యాను, సభావేదిక, తడి, పొడి చెత్త వేరు చేసేందుకు కుండీలు ఏర్పాటు చేశారు.

అన్నింట ఆదర్శం

పాఠశాల ఆవరణలో 150 మొక్కలు నాటి హరితవనంగా మార్చారు. చుట్టుపక్కల కూడా పచ్చగా ఉండాలనే సామాజిక సృహాతో... పాఠశాల పక్కనే ఉన్న వెయ్యి గజాల స్థలం అన్యాక్రాంతం కాకుండా చదును చేసి, కంచె వేసి మొక్కలు నాటారు. ఈ పాఠశాలలో ఆట పాట, కృత్యాధార వంటి వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. ప్రతినెలా చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి... విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తూ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటున్నారు.

ఉపాధ్యాయుల కృషితో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలను కాదని ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలను హరితవనం చేసిన ఉపాధ్యాయులు

ఇదీ చూడండి: 'రాజకీయాలను తెరాస, భాజపాలు రక్తికట్టిస్తున్నాయి'

Intro:Tg_mbnr_04_26_Swacha_patashala_pkg_TS10092
హరిత హారంలో భాగంగా కేవలం మొక్కలు నాటితే లక్ష్యం నెరవేరదు అవి మానులై ఎదిగే వరకు కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత భావి పౌరుల పైనే ఉంది. ఇలాంటి సామాజిక స్పృహను పెంపొందించేందుకు పాఠశాలను హరిత వనాలుగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. పాఠశాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగారు ఉపాధ్యాయులు మొదట సొంతంగా డబ్బులు వెచ్చించి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించారు.ఆతర్వాత దాతల సహకారంతో రూపాయలు మూడు లక్షలు వ్యయం చేసి పాఠశాల రూపురేఖలను మార్చారు.సర్కారు బడిని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చి దిద్దారు.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాల ఆవరణ హరిత వనాన్ని తలపిస్తుంది. ఆవరణ మొత్తం ఎత్తైన, అందమైనా చెట్లతో అలరిస్తుంది. నిత్యం విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. పాఠశాల తనిఖీకి వచ్చే అధికారులు సైతం అక్కడి పచ్చదనాన్ని చూసి అభినందిస్తున్నారు. స్వచ్చతలో జిల్లాలోనే పాఠశాలను మొదటి స్థానంలో నిలిపారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమంలో ఇది 2018- 2019 సంవత్సరానికి పురస్కారం అందుకున్నారు. 2018 జూన్లో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ మొదట ఉపాధ్యాయుల అందరితో 40 వేలు పోగుచేసి పాఠశాల భవనానికి రంగులు వేయించారు. తరగతి గదిలో నీతి వాక్యాలు రాయించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పాఠశాల సమస్యలు పరిష్కరించేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. అందుకు పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి గ్రామస్తులు అవగాహన కల్పించడంతో ఇరవై రోజుల్లో రూపాయలు మూడు లక్షలు జమయ్యాయి . ఈ నిధులతో అసంపూర్తి మరుగుదొడ్లకు మరమ్మతులు ,పాఠశాలకు రక్షిత నీటి ట్యాంకు, గ్రంథాలయ గది నిర్మాణం, ప్రతి తరగతికి ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. సంస్కృతి కార్యక్రమాలకు సభావేదిక, పొడి చెత్త, తడి చెత్త వేసేందుకు కుండీలు ఏర్పాటు చేశారు. పాఠశాల పక్కన వెయ్యి గజాల స్థలం అన్యాక్రాంతం కాకుండా చదును చేసి మొక్కలు నాటారు. ఇనుప కంచె వేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఆటపాట, కృత్యాధార పద్ధతిలో బోధన చేస్తున్నారు. ప్రతినెల విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నారు. నాన్యమైన బోధన, మధ్యాహ్నం భోజనం,ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న విద్యార్థులు,చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల కన్నా లింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటామని ఆసక్తి కనబరుస్తున్నారు. పాఠశాలను సందర్శించిన వారు కార్పొరేట్ పాఠశాలను మాదిరిగా తలపిస్తుందని తెలుపుతున్నారు. పాఠశాల ఆవరణలో 150 పైగా మొక్కలు నాటి వాటిని పెంచి హరిత వనం గా మార్చారు...

Conclusion: బైట్స్ :
1) మహేష్ పాటశాల విద్యార్థి
2) నందకిషోర్ పాఠశాల విద్యార్థి
3) వరలక్ష్మి పాటశాల విద్యార్థిని
4) నవదీప్ పాఠశాల విద్యార్థి
5) రామన్ గౌడ్ పాఠశాల ఉపాధ్యాయుడు
6) తాయప్ప గ్రామస్తుడు
7) చంద్రశేఖర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

9959999069,మక్థల్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.