నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరుతుండటం వల్ల ఇప్పటికీ... ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీనితో అధికారులు ముందు జాగ్రత్తగా రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
రిజర్వాయర్ గేట్ నంబర్5, 7ల ద్వారా నీటిని కిందికి విడిచిపెట్టమని అధికారులు తెలిపారు. వాగు పరివాహక ప్రాంతంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ సయ్యద్, తెరాస మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత