నారాయణ పేట జిల్లా మాగనురులో రైల్వే నిర్మాణం పనుల నిమిత్తం వచ్చి ఇరుక్కుపోయిన వలస కార్మికులకు కాంట్రాక్టర్ అయ్యప్ప రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ హరిచందన, మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
కరోనా వ్యాధి నివారణకు ప్రజలు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.