ETV Bharat / state

పాఠశాలల్లో వంట గదుల్లేక ఏజెన్సీల పాట్లు - schools

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీలకు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాయి. వంట గదుల్లేక ఎండకి ఎండుతూ.. వానలో తడుస్తూ వండి పెట్టాల్సిన పరిస్థితి. నారాయణ పేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాఠశాలల్లో వంట గదుల్లేక ఏజెన్సీల పాట్లు
author img

By

Published : Sep 25, 2019, 4:32 PM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు చేరడంలో అనేక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. నారాయణ పేట జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో వంట గదుల్లేక వంట ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నిచోట్ల గదులు నిర్మించినా అవి వంట చేసేందుకు అనువుగా లేవు. కనీసం ఇద్దరు మనుషులు కూర్చునేందుకు... వంట పాత్రలు తీసుకెళ్లేందుకు కూడా వీలుగా లేవని సిబ్బంది వాపోతున్నారు.

18 ఏళ్లుగా ఆరుబయటే...

జిల్లా కేంద్రంలోని వైదిక పాఠశాలలో 18 ఏళ్లుగా ఏజెన్సీ నిర్వాహకులు ఆరు బయటే వంట చేస్తున్నారు. వర్షమొస్తే తమ తిప్పలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని వాపోతున్నారు. దాతలెవరైనా స్పందించి వంట గదిని నిర్మించాలని కోరుతున్నారు.

దాతలెవరైనా సాయం చేయండి

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన వంటగదులు అనుకూలంగా లేకపోవడం... చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. అధికారులు, దాతలెవరైనా స్పందించి వంటగదిని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పాఠశాలల్లో వంట గదుల్లేక ఏజెన్సీల పాట్లు

ఇదీ చూడండి: అక్కడి విద్యార్థులు వర్షం కురవొద్దని కోరుకుంటారు... ఎందుకంటే?

Intro:Tg_Mbnr_17_19_Vanta_Thanta_PKG_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabub har

నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్నం భోజనం చేసే వంట ఏజెన్సీలకు వర్షం పడితే చాలు ఆరుబయట వంట చేసేవారికి ఇబ్బందులు తప్పడం లేదు కొన్ని పాఠశాలకు వంటగదిలో నిర్మాణం చేయలేదు మరి కొన్ని పాఠశాలలు వంటగదిలో ఉన్న అవి వంట చేసేందుకు అనువుగా లేని ఈ విధంగా నిర్మాణాలు చేపట్టినా మన వారికి ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు వంట వంట చేసే ఏజెన్సీల ఇబ్బందులపై ప్రత్యేకతలు

Body:నారాయణపేట జిల్లాలో ప్రాథమిక పాఠశాలలో మరియు ఉన్నత పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ ద్వారా నిర్మించిన వంట గదులు అవి ఏజెన్సీలకు వంట చేసేందుకు అనువుగా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ గదిలో ఎక్కువగా ఉన్నందున వంట పాత్రలు తీసుకెళ్లేందుకు విలువ లేదు కావున ఏజెన్సీ ఆయా పాఠశాలలు వంటలు ఆరుబయట చేసి విద్యార్థులకు సమయానికి అందిస్తున్నారు వర్షం పడితే చాలు ఇక్కడ అ వంట చేసే నిర్వాహకులకు తిప్పలు తప్పడం లేదు కావున నారాయణపేట జిల్లా లో ఉన్న ఇరుకైన వంటగది ప్రాంతంలో వారికి అనువైన ఏర్పాటుచేసి తొలగించాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు జిల్లా కేంద్రంలో ఉన్న వైదిక పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ఇందులో ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది పాఠశాలలో గత 18 సంవత్సరాలుగా వంటగది లేదన్న ఇక్కడ ఏజెన్సీ నిర్వాహకులు ఆరుబయట వంట చేస్తున్నాను వర్షం పడిన ఆ వర్షంలోనే తాము వంట చేస్తున్నారు ఇదేంటని etv bharat వారిని ప్రశ్నించగా ఈ పాఠశాల దాతల సహకారంతో కొనసాగుతుంది ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు తెలియకుండా ఉచితంగా ఇక్కడ విద్యాబోధన కొనసాగుతోంది కానీ పాఠశాల ఉన్నందున ప్రభుత్వం నుండి వంట గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసే అవకాశం లేదు కావున ఇక్కడ వంట ఏజెన్సీ నిర్వాహకులకు వర్షంలో ఇబ్బంది కలగటం లేదని వాపోతున్నారు కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ వైదిక పాఠశాలకు కిచెన్ సెట్ నిర్మాణం చేసినట్లయితే తమ సమస్య ఉపశమనం కలుగుతుందని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు ఈ పాఠశాలలు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు స్థానంలో స్వచ్ఛందంగా టీచర్ ట్రైనింగ్ చేసిన ఉపాధ్యాయులు ఇక్కడ విద్యార్థులకు విద్యను బోధిస్తున్న అని కావున ఈ పాఠశాలకు దాతల సహకారం అవసరమని వంట ఏజెన్సీ నిర్వాహకులు తమ అభిప్రాయం వెలిబుచ్చారు

Conclusion:నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలలో వంట గదులు పాఠశాలలో ఆరుబయట వంట చేస్తున్నారు కొన్ని పాఠశాలకు ఉన్నంత వరకు చేరాయి మరి కొన్ని పాఠశాలల్లో అవి వాటిలో వంట తీసుకెళ్లేందుకు ఆరుబయటే వంట చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలుగా ఉండే నిర్మాణం వారు కోరుతున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.