నారాయణపేట జిల్లా మక్తల్‌లో డయ్ల్ 100 వాహనం ప్రమాదానికి గురైంది. మక్తల్ నుంచి నారాయణపేట వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా రోడ్డుపైకి పందులు వచ్చాయి. అడ్డు వచ్చిన పందులను తప్పించబోయి వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది.
ప్రమాదం సమయంలో వాహనంలో డ్రైవర్ మక్బుల్ మాత్రమే ఉన్నాడు. ఘటనలో వెంటనే బెలూన్ తెరుచుకోవటం వల్ల డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు.