నారాయణపేట జిల్లాలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాల విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణానికి కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పింంచారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రతి గృహిణి బయట మార్కెట్లో వస్తువులు కొనేందుకు వచ్చేటప్పుడు... బట్టతో కూడిన చేతి సంచులు తీసుకొని రావలసిందిగా కోరారు. వర్షం పడినప్పుడు ఆ నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ అడ్డుపడుతోందన్నారు. దీని వాడకాన్ని తగ్గించి భావితరాలకు అందమైన ప్రకృతిని బహుమతిగా ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, జెడ్పీ సీఈవో కాళిందిని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బరువైన బాల్యం.. బడి బ్యాగు భయపెడుతోంది!